హైదరాబాద్ టప్పాచబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని కుమర్వాడీ వద్ద అనుమతి లేకుండా బెల్టు షాపు నడిపిస్తున్నారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఓ ఇంట్లో సోదాలు చేసి 150 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.50 వేల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. రాత్రివేళ మద్యాన్ని అమ్మడం, గాంధీ జయంతి వంటి సందర్భాల్లో అధిక ధరలకు విక్రయించి లాభాలు గడిస్తున్నారని పేర్కొన్నారు.
ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు ఇకపై జరగనివ్వకుండా చూసుకుంటామని పోలీసులు తెలిపారు. ముగ్గురిని అదుపులోకి తీసుకొని... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఉన్నత అధికారుల ఆదేశాలతో తనిఖీ చేసినట్లు ఎస్ఐ మధు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: అక్రమంగా తరలిస్తున్న 30 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం