ఇంటికి కన్నాలు వేసి దొంగతనాలకు పాల్పడుతున్న ఓ దొంగను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన మంచిర్యాలలో చోటుచేసుకుంది. నిందితుడి నుంచి బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ ఉదయ్ కుమార్ వెల్లడించారు. నిందితుడు జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన వాడని తెలిపారు.
ఈ విధంగా..
నిందితుడు ఉస్మాన్.. కాలనీల్లో తిరుగుతూ బట్టల వ్యాపారం చేస్తున్నట్టుగా నటిస్తాడు. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చేసుకుంటాడు. రాత్రుళ్లు ఇళ్లల్లో చోరీలకు పాల్పడతాడు.
" సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ, కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో, చోరీ కేసులకు సంబంధించి నిందితుడు గతంలోనూ జైలు శిక్ష అనుభవించాడు. దొంగిలించిన నగదును హైదరాబాద్లో అమ్మటానికి వెళ్తుండగా.. చాకచక్యంగా పట్టుకున్నాం. 240 తులాల బంగారు ఆభరణాలు, 16 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నాం'
- డీసీపీ ఉదయ్ కుమార్
ఇదీ చూడండి: సిడ్నీ టెస్టులో సంబరాలు బంద్