ఆశా కార్యకర్తను ఎంపీటీసీ భర్త లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం పార్‌పెల్లిలో చోటుచేసుకుంది. పార్పెల్లి తండాకు చెందిన మహిళ ఆశా కార్యకర్తగా పనిచేస్తుంది. ఆమెను పార్పెల్లికి చెందిన ఎంపీటీసీ కల్యాణి భర్త గోవర్ధన్ ప్రతి రోజు రాత్రి, పగలు అని తేడా లేకుండా లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఎస్సై యూనుస్ అహ్మద్ అలీ తెలిపారు.
ఇదే విషయాన్ని ఆమె నిందితుని కుటుంబ సభ్యులకు తెలపగా కొన్ని రోజులు ఫోన్ చేయడం మానేశాడు. మళ్లీ ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ఫోన్ చేసి లైంగిక కోరిక తీర్చాలని వేధించాడు. విసిగిపోయిన బాధితురాలు లక్ష్మణచాంద పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఫిర్యాదు స్వీకరించిన ఎస్సై యూనుస్.. ఎంపీటీసీ భర్త గోవర్ధన్‌పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: జుంబా డ్యాన్స్ పేరిట లైంగిక వేధింపులు