లాక్డౌన్ నేపథ్యంలో పేకాట రాయుళ్లు రెచ్చిపోతున్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండల పరిధిలోని ఏనుగల్లు, బురుమళ్ల గ్రామాల్లో పేకాట రాయుళ్లు స్థావరాలు ఏర్పరుచుకుని జూదం ఆడుతున్నారు.
జిల్లాలో ఇప్పటికే పలుమార్లు పోలీసులకు చిక్కినా పేకాటరాయుళ్లు తమ పద్ధతి మార్చుకోవడం లేదు. ఈరోజు పర్వతగిరి మండలంలో పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్టు చేశారు.