మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన శివ, కరీంనగర్‌కు చెందిన చిన్నా అనే ఇద్దరు కలిసి ముంబై, పశ్చిమ బంగాల్ తదితర ప్రాంతాల నుంచి ఒప్పందం ప్రకారం యువతులను తీసుకొచ్చి.. వారితో వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఇందుకోసం దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్ సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నట్లు తెలిపారు. సదరు యువతుల ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచుతున్నట్లు విచారణలో బయట పడిందని వివరించారు.
ముఠాపై నిఘా పెట్టిన పోలీసులు వారిని పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని.. పరారీలో ఉన్న చిన్నా కోసం గాలిస్తున్నారు.