ETV Bharat / jagte-raho

యాదాద్రి జిల్లాలో కొనసాగుతున్న భూ కబ్జాలు - yadadri district crime news

యాదాద్రి భువనగిరి జిల్లాలోని తన భూమిని కొందరు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఎస్ఎస్వీ డెవలపర్స్ యజమాని మోహన్‌చారి అన్నారు. అధికార పార్టీ నేతల అండదండలతోనే వారు ఈ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తన ప్లాట్ల సరిహద్దురాళ్లను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశాడు.

Ongoing land grabs in Yadadri district
యాదాద్రి జిల్లాలో కొనసాగుతున్న భూ కబ్జాలు
author img

By

Published : Dec 28, 2020, 9:52 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామం పరిధిలోని సర్వే నంబర్ 17, 18, 19, 20 లోని 51 ఎకరాల్లో గల తన‌ వెంచర్‌ను తాళ్ల రాంచందర్ అనే వ్యక్తి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఎస్ఎస్వీ డెవలపర్స్ యజమాని మోహన్‌చారి ఆరోపించారు. అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులతో కలిసి తన స్థలంలోని ప్లాట్ల కడ్డీలను విరగ్గొట్టారని ఆవేదన‌ వ్యక్తం చేశారు.

గతంలో అమ్మిన భూమికి మళ్లీ ఒప్పందం

తాళ్ల రాంచందర్ అనే వ్యక్తి 2008 లోనే తనకు 51 ఎకరాల 18 గుంటల భూమిని అమ్మారని మోహన్‌చారి తెలిపారు. అదే భూమిలో లేఔట్ చేసి కస్టమర్లకు ప్లాట్లు అమ్మానని పేర్కొన్నారు. కానీ రాంచందర్ మళ్లీ అదే భూమిని అధికార పార్టీకి చెందిన వ్యక్తులకు అమ్మడానికి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. కొందరు వ్వక్తులు తన వెంచర్​లోని ప్లాట్లను మొత్తం‌ లెవల్ చేసి కబ్జాకు పాల్పడుతున్నారని ఆవేదన‌ వ్యక్తం చేశారు.

సరిహద్దురాళ్లును తొలగించారు

అప్పటి (2008) ధరల ప్రకారంగా ఎకరాకు రూ.4.40 లక్షల చొప్పున మొత్తం 51 ఎకరాలకు గానూ రూ.2.24 కోట్లు విడతల వారిగా చెల్లించానని, కానీ భూముల రేట్లు పెరగడంతో ఇంకా ఎక్కువ డబ్బులు కావాలని రాంచందర్ డిమాండ్ చేశారని మోహన్‌చారి తెలిపారు. అతను పెట్టిన డిమాండ్లకు లొంగకపోవడంతో అధికార పార్టీకి చెందిన వ్యక్తులతో తన వెంచర్‌ను కబ్జా చేయడానికి ప్లాట్ల హద్దురాళ్లను తొలగించాని ఆరోపించారు.

కఠిన చర్యలు తీసుకోవాలి

పైసా పైసా కూడబెట్టి కొన్న ప్లాట్లను అధికార పార్టీ నాయకులు కబ్జా చేశారని ప్లాట్ల కొనుగోలుదారులు ఆవేదన చెందుతున్నారు. వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకుని తమ ప్లాట్లు తమకు దక్కేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కబ్జాకు పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే నిరసన తెలుపుతున్న బాధితులను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించారు. పరిస్థితుల దృష్ట్యా 145 సెక్షన్ విధించామని, ఈ ప్రదేశంలో ఎవరూ ఉండొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు.

కొత్త డ్రామాకు తెరతీశారు

తాళ్ల రాంచందర్ నుంచి 27 ఎకరాల భూమి కొనుగోలుకు 2019 లోనే ఒప్పందం చేసుకున్నానని దామోదర్ గౌడ్ అనే వ్యక్తి తెలిపారు. సైదాపురం పరిధిలోని నాలుగు సర్వే నంబర్లలో ఉన్న 51 ఎకరాల భూమిలో 23 ఎకరాల భూమిని 2008లో సురేష్ అనే వ్యక్తి నుంచి మోహన్‌చారి కొనుగోలు చేశాడని, మిగతా 27 ఎకరాలను కూడా కబ్జా చేసి మొత్తం 51 ఎకరాల్లో ప్లాట్లు అమ్మారని పేర్కొన్నారు. కొనుగోలుదారుల నుంచి ఒత్తిడి రావడంతో వాటి నుంచి తప్పించుకోవడానికి నిరసన పేరుతో మోహన్ మరో కొత్త డ్రామాకు తెరతీశాడని అన్నారు.

ఇదీ చదవండి: దారి తప్పుతున్న యువత.. ప్రమాదంలో భవిత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.