సంగారెడ్డి జిల్లా ఆంధోల్ మండలం అల్మై పేటలో విషాదం జరిగింది. బతుకమ్మను నిమజ్జనం చేసేందుకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. అల్మై పేటకు చెందిన నవీన్... కుటుంబసభ్యులతో కలిసి దేవుని చెరువులో నిమజ్జనం చేసేందుకు వెళ్లాడు.
బతుకమ్మను నిమజ్జనం చేసే క్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువు నిండుకుండలా ఉంది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.