ETV Bharat / jagte-raho

నల్గొండ ఎస్పీ అకౌంట్​ హ్యాక్.. డబ్బుల వసూళ్లకు పాల్పడిన కేటుగాళ్లు! - నల్గొండ ఎస్పీ

సైబర్​ నేరగాళ్లు, హ్యాకర్లు సామాన్యులు, అమాయకులనే కాదు.. రాజకీయ నాయకులు, పోలీసులను కూడా వదలడం లేదు. ఈసారి ఏకంగా జిల్లా ఎస్పీ సోషల్​ మీడియా అకౌంట్​నే హ్యాక్​ చేశారు. అంతేకాదు.. తాము చెప్పిన అకౌంటుకు డబ్బులు పంపి.. స్క్రీన్​షాట్లు పంపాలని బెదిరించారు.

Nalgonda Sp Facebook Account Hacked
నల్గొండ ఎస్పీ అకౌంట్​ హ్యాక్.. డబ్బుల వసూళ్లకు పాల్పడిన కేటుగాళ్లు!
author img

By

Published : Sep 18, 2020, 10:40 PM IST

నల్గొండ జిల్లా ఎస్పీ ఫేస్​బుక్​ ఖాతాను సైబర్​ నేరగాళ్లు హ్యాక్​ చేశారు. రంగనాథ్​ ఆవులవెంకట పేరుతో ఫేస్​బుక్​ ఖాతా క్రియేట్​ చేసి పలువురికి ఫ్రెండ్​ రిక్వెస్ట్​ పంపించారు. రిక్వెస్ట్​ ఓకే అయిన వెంటనే.. ఛాటింగ్ చేసి.. తాము చెప్పిన అకౌంట్​కు గూగుల్​ పే, ఫోన్​ పే ద్వారా డబ్బులు పంపాలని మెసేజ్​లు పెట్టారు. అనిత అనే ఒరిస్సా మహిళ పేరుతో ఉన్న గూగుల్​ పే, ఫోన్​ పే నెంబరు పంపి.. డబ్బులు పంపగానే.. స్క్రీన్​షాట్​ తీసి పంపాలంటూ సందేశాల్లో కోరారు.

ఈ విషయం తెలుసుకున్న ఎస్పీ రంగనాథ్​ ప్రస్తుతం రిక్వెస్టులు వస్తున్న ఫేస్​బుక్​ ఖాతాను రెండేళ్ల క్రితమే వాడడం మానేసినట్టు తెలిపారు అది తన ఐడీ కాదని.. ఎవరూ నమ్మి ఫ్రెండ్​ రిక్వెస్ట్​ ఓకే చేయవద్దని, డబ్బులు పంపి మోసపోవద్దని సూచించారు. తన ఫేస్​బుక్​ అకౌంట్​ హ్యాకింగ్​పై ఫిర్యాదు చేసి.. నిందితులను త్వరలో పట్టుకోనున్నట్టు ఎస్పీ తెలిపారు.

ఇదీ చూడండి: 'అమరుల స్ఫూర్తి నిత్యం జ్వలించేలా స్మారకం ఏర్పాటు...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.