వనపర్తి జిల్లా కేంద్రంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. రెండు వర్గాల ఆధిపత్య పోరులో బలయ్యాడు. రాఘవేంద్ర అనే యువకుడిని స్థానిక రామాలయం వద్ద అరుణ్ అనే వ్యక్తి బండరాయితో తలపై మోదడంతో అక్కడిక్కడే మరణించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
ఇవీ చూడండి:కోటి రూపాయల డ్రగ్స్ పట్టివేత