ఆంధ్రప్రదేశ్ గుంటూరులో తల్లీకుమార్తె ఆత్మహత్య ఘటనకు సంబంధించి మృతదేహాల అప్పగింతపై జీజీహెచ్ శవాగారం వద్ద వివాదం జరిగింది. మృతదేహాలను మనోజ్ఞ అత్తారింటికి తీసుకువెళ్లేందుకు కుటుంబసభ్యులు ప్రయత్నించగా... పోలీసులు అడ్డుకున్నారు. ఓకవైపు కరోనా నిబంధనలు... మరోవైపు శాంతిభద్రతల దృష్ట్యా వివాదం తలెత్తకుండా పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
తమ బిడ్డ ఆత్మహత్య చేసుకోలేదని... తన అత్తామామ, భర్త కలిసి చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలి బంధువులు ఆరోపించారు. వారికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని కుటుంబసభ్యులు ఆరోపించారు.
మృతురాలు తల్లి విజయలక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పట్టాభిపురం సీఐ పూర్ణచంద్రరావు తెలిపారు. పోస్టుమార్టం పూర్తిచేసి మృతదేహాలను వారి బంధువులకు అప్పగించామని చెప్పారు. విచారణ అనంతరం నిందితులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: శ్రీశైలం ఆలయాన్ని దర్శించుకున్న హైకోర్టు సీజే మహేశ్వరి