మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి పీఎస్ పరిధిలో ఓ వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. భర్త సాయి చరణ్‌పై మృతురాలి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే...
2016 సంవత్సరంలో పెద్దలను ఎదిరించి సాయిచరణ్, సమీనా మతాంతర వివాహం చేసుకున్నారు. మల్కాజిగిరిలోనే నివాసం ఉండేవారు. గత కొన్ని రోజులుగా వీరి మధ్య గొడవలు తలెత్తాయని బంధువులు తెలిపారు. రెండు రోజుల క్రితం సమీనా ఉరేసుకుని చనిపోయింది. భర్త వేధింపుల కారణంగా చనిపోయిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.
ఇవీ చూడండి: మీ ఇంట్లోనే కరోనా చికిత్స.. వైరస్ నుంచి బయటపడే మార్గం