యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం పాముకుంట శివారులో... మెదక్ జిల్లా చేర్యాల మండలం కడవేర్గుకు చెందిన తుర్కపల్లి విజయ్(30) చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పాముకుంటకు చెందిన బాలమణితో 5 ఏళ్ల క్రితం వివాహమైంది. రెండు రోజుల క్రితం దీపావళి పండుగ కోసం అత్తగారింటికి వచ్చాడు.
బయటకు వెళ్లిన విజయ్... ఆదివారం ఉదయం నుంచి కనిపించడం లేదని బంధువులు, స్థానికులు వెతికగా... గ్రామ శివారులో చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్టు ఎస్సై శ్రీధర్ రెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి: విషాదం: నాటుబాంబు పేలి విద్యార్థి మృతి