ETV Bharat / jagte-raho

సెల్​ఫోన్​ ఛార్జర్​తో విద్యుదాఘాతం.. వ్యక్తి మృతి​ - విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

man died due to current shock
సెల్‌ఫోన్ ఛార్జింగ్.. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
author img

By

Published : May 5, 2020, 12:43 PM IST

Updated : May 5, 2020, 4:01 PM IST

10:56 May 05

సెల్​ఫోన్​ ఛార్జర్​తో విద్యుదాఘాతం.. వ్యక్తి మృతి​

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం కేర్చిపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. జోడి దేవాజీ అనే వ్యక్తి తాను పనిచేసే కోళ్ల ఫారం వద్ద సెల్​ఫోన్ ఛార్జింగ్ పెట్టి, దానిని తన ఛాతిపై పెట్టుకొని పడుకున్నాడు. ప్రమాదవశాత్తు సెల్​ఫోన్ ఛార్జర్ ద్వారా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనలో దేవాజీ చేతులు, సెల్​ఫోన్ కాలిపోయాయి. మృతిడికి భార్య ఉంది.

మద్దెల రవికి చెందిన కోళ్ల ఫారంలో గత 14 నెలలుగా దేవాజీ పని చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.    

ఇదీచూడండి: జహీరాబాద్​ ట్రాన్స్​ఫార్మర్​ గ్యారేజీలో అగ్నిప్రమాదం

Last Updated : May 5, 2020, 4:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.