ETV Bharat / jagte-raho

అనుమానాస్పద స్థితిలో మెకానిక్​ మృతి - నిజామాబాద్​ తాజా వార్తలు

నిజామాబాద్ నగరంలోని మహేంద్ర ట్రాక్టర్ షోరూంలో పనిచేస్తున్న మెకానిక్​ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రోజుమాదిరి గానే బుధవారం ఉదయం విధులకు వచ్చిన శ్రీనివాస్​కు పిట్స్​ రావడం వల్ల ఆస్పత్రికి తరలించగా... గుండెపోటుతో మృతి చెందాయడని షోరూం నిర్వాహకులు తెలిపారు.

అనుమానాస్పద స్థితిలో మెకానిక్​ మృతి
అనుమానాస్పద స్థితిలో మెకానిక్​ మృతి
author img

By

Published : Sep 17, 2020, 6:56 AM IST

నిజామాబాద్​ నగరంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మహేంద్ర ట్రాక్టర్​షోరూంలో మెకానిక్​గా పనిచేస్తున్న శ్రీనివాస్​ మృతిపై అతడి భార్య అనుమానం వ్యక్తం చేసింది. బుధవారం ఉదయం ఐదు గంటలకు తోటి మెకానిక్​తో కలిసి షోరూంకి వెళ్లాడని పేర్కొన్నారు. తలపై గాయం ఉందని, మృతదేహాన్ని కారులోనే ఉంచారని మృతుని భార్య కావ్య ఆరోపించింది. తమకు న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు షోరూంలోనే భైఠాయించారు.

విధులకు హాజరైన శ్రీనివాస్​ పనిలో భాగంగా పెర్కట్​ వెళ్లాడని అక్కడ పిట్స్​ రావడం వల్ల ఆస్పత్రికి తీసుకెళ్లగా... గుండెపోటుతో మృతి చెందాడని షోరూం నిర్వాహకులు తెలిపారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా తదుపరి విచారణ కొనసాగిస్తామని రూరల్ ఎస్​హెచ్​వో మధుసూదన్ గౌడ్ తెలిపారు.

ఇదీ చూడండి: బెడిసికొట్టిన రిపోర్టర్​ డీలింగ్​... ట్రాప్​లో పడి కిడ్నాప్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.