ఓ యువతి, అశోక్ కుమార్ అనే వ్యక్తి ప్రేమించుకున్నామని... జీవితాంతం కలిసి ఉంటానని హామీ ఇచ్చుకున్నామని... కానీ అతనికి ప్రభుత్వోద్యగం రాగానే ప్రియుడు మొహం చాటేశాడు అంటూ ఓ యువతి హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసింది. కమిషన్ ముందు హాజరైన ప్రియుడిని ఆమె నిలదీసింది.
''నన్ను ప్రేమించావ్.. దగ్గరికి తీసుకున్నావ్... గర్భవతిని చేశావ్... పెళ్లి చేసుకుంటానని చెప్పి అబార్షన్ చేయించావ్.. ప్రభుత్వ ఉద్యోగం రాగానే ఎందుకు వదిలేశావ్. వేరే పెళ్లి చేసుకుని నన్ను ఎందుకు మోసం చేశావ్'' అంటూ యువతి బోరున విలపించింది. ఆగ్రహించిన అశోక్ ఆమెపై దాడి చేశాడు. అక్కడే ఉన్న పోలీసులు ఇరువురికి సర్దిచెప్పారు. ప్రేమ పేరుతో తన జీవితంతో ఆడుకున్న అన్యాయం చేసిన అశోక్ కుమార్ నాయక్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.
ఇదీ చూడండి: ఫేస్బుక్ ద్వారా పరిచయం... ప్రేమ పేరుతో మోసం