సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్‌కు చెందిన స్వాతిని పటాన్చెరు శివారు బండ్లగూడకు చెందిన శివశంకర్‌కు ఇచ్చి ఈ ఏడాది మార్చిలో వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో కొంత కట్నం తీసుకున్నారు. కొంతకాలం బాగానే ఉన్న భర్త శివశంకర్ అదనపు కట్నం కావాలంటూ తల్లి భారతమ్మతో కలిసి భార్య స్వాతిని వేధింపులకు గురి చేశాడు.
గత కొంత కాలంగా భర్త, అత్త వేధింపులు భరించలేని స్వాతి.. తల్లిగారి ఇంటివద్ద శుక్రవారం ఫ్యానుకు చీరతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. స్వాతి ప్రస్తుతం గర్భవతిగా ఉంది. అమీన్పూర్ పోలీసులు భర్త శివశంకర్ అత్త భారతమ్మపై వరకట్న వేధింపుల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:కేంద్రం 'దిగుమతి' నిర్ణయం.. మొక్కజొన్న రైతులకు శరాఘాతం