ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా గాజువాక శ్రీనగర్ సుందరయ్యకాలనీలో దారుణం జరిగింది. ఇంటర్ చదువుతున్న 17 ఏళ్ల యువతిని ఓ ప్రేమోన్మాది గొంతుకోసి దారుణంగా హతమార్చాడు. ఘటనాస్థలంలో ఇద్దరు యువకులు ఉన్నట్లు పోలీసులు గుర్తించగా... అఖిల్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో యువకుడి కోసం గాలిస్తున్నారు. అఖిల్ న్యాయవిద్య అభ్యసిస్తున్నట్లు గుర్తించగా... కత్తితో ఎవరు దాడి చేశారనే దానిపై పోలీసులు విచారిస్తున్నారు.
ఇవీ చూడండి: భార్యపై యాసిడ్ దాడికి పాల్పడిన భర్త