సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో మల్లెచెట్టు చౌరస్తాలోని దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా కనిపించిన ఓ పాన్‌షాప్ నిర్వాహకుని వద్ద అక్రమంగా నిల్వ ఉన్న రూ. లక్ష విలువ గల ప్రభుత్వ నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. పాన్ షాప్ నిర్వాహకుడిని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ మహేందర్ తెలిపారు. గత మూడేళ్లలో 50 కేసుల వరకు నమోదయ్యాయని ఏసీపీ వెల్లడించారు.
ప్రభుత్వ నిషేధిత గుట్కా ప్యాకెట్లు తినడం ఆరోగ్యానికి హానికరమని, నిషేధిత గుట్కా ప్యాకెట్లను విక్రయించినా, కొనుగోలు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని ఎసీపీ వెల్లడించారు. హుస్నాబాద్ డివిజన్ పరిధిలో గుట్కా ప్యాకెట్ల వ్యాపారంపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు.
ఇదీ చూడండి: రాయలసీమ ఎత్తిపోతాలు ఆపాలని కోరిన తెలంగాణ సర్కారు