ETV Bharat / jagte-raho

మమ్ముదాటి మీరు పోలేరులే.. ఇది నిజములే..! - పాపిలాన్​తో హైదరాబాద్​ పోలీసుల తనిఖీలు

నేరాలు నియంత్రించేందుకు హైదరాబాద్‌ పోలీసులు అనుమానాస్పద వ్యక్తులు, అపరిచితులను గుర్తించేందుకు రాత్రివేళల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. జనసమ్మర్థ ప్రాంతాలు, రైల్వేస్టేషన్లు, బస్‌స్టాండ్‌లలో వేలమంది ప్రయాణికుల రాకపోకలు, మల్టీప్లెక్స్‌లు, షాపింగ్‌మాల్స్‌ వద్ద రాత్రుళ్లు నిఘా ఉంచుతున్నారు. దీంతోపాటు శాంతిభద్రతలకు ముప్పు గుర్తించేందుకు పాపిలాన్‌ యంత్రాలను వినియోగిస్తున్నారు.

మమ్ముదాటి మీరు పోలేరులే.. ఇది నిజములే..!

author img

By

Published : Feb 5, 2021, 7:00 AM IST

నేరాలు నియంత్రించేందుకు హైదరాబాద్‌ పోలీసులు విస్త్రుతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాత్రివేళల్లో ట్రాఫిక్‌, శాంతిభద్రతల పోలీసులు వేర్వేరుగా తనిఖీలు నిర్వహించి అనుమానితులు, అపరిచితుల వేలిముద్రలను సేకరిస్తున్నారు. నేరస్థులనే అనుమానం రాగానే పాపిలాన్‌ ద్వారా అప్పటికప్పుడే తనిఖీలు చేసి ఆధార్‌ సర్వర్‌తో సరిపోల్చుతున్నారు. ఇలా రోజుకు సుమారు 400 మంది నుంచి ఇలాంటి వివరాలను సేకరిస్తున్నారు. పాపిలాన్‌ యంత్రాన్ని ఉపయోగించడం ద్వారా పశ్చిమ, దక్షిణ మండలాల్లో నమోదైన కొన్ని కేసుల్లో నిందితులను అరెస్ట్‌ చేశారు కూడా. భవిష్యత్తులో ఈ విధానం ద్వారా నేరనియంత్రణ సులభమవుతుందని పోలీస్‌ ఉన్నతాధికారులు తెలిపారు.

రాత్రి గస్తీ.. డ్రంకెన్‌ డ్రైవ్‌..

నగరంలో నేరనియంత్రణ, రౌడీషీటర్లు, కరడుగట్టిన నేరగాళ్లను పట్టుకునేందుకు హైదరాబాద్‌ పోలీసులు రాత్రివేళల్లో కొన్ని ప్రత్యేక గల్లీలు, కాలనీలు, నేరస్థులున్న ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. పాతబస్తీలోని పలు ప్రాంతాలు పశ్చిమ మండలం పరిధిలోని హుమయూన్‌నగర్‌, ఆసిఫ్‌నగర్‌, బంజారాహిల్స్‌, మంగళ్‌హాట్‌, షాహినాయత్‌గంజ్‌, టప్పాచబుత్ర ఠాణాల పరిధుల్లో రౌడీషీటర్లు, వారి అనుచరులను అదుపులోకి తీసుకుని తాజాగా వేలిముద్రలను సేకరించారు. దీంతోపాటు సికింద్రాబాద్‌, తూర్పు, మధ్యమండలం పరిధుల్లో తరచూ రాత్రివేళల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రధాన ప్రాంతాల్లో గస్తీ నిర్వహిస్తున్న పోలీస్‌ బృందాలు.. ప్రధాన రహదారులకు దారితీసే అనుసంధాన రహదారులకు వెళ్లి రాత్రి 10 గంటల తర్వాత బైక్‌లపై వస్తున్న వారిని, నడుచుకుంటూ వెళ్తున్న వారిని ఆపి వారి వివరాలు, గుర్తింపుకార్డులు అడుగుతున్నారు.

లాడ్జీలు.. హోటళ్లు..

జగదీష్‌ మార్కెట్‌లోని ఆలయంలో దొంగతనం చేసిన అంతరాష్ట్ర ముఠా సభ్యులను మధ్యమండలం పోలీసులు అరెస్ట్‌ చేశారు. దొంగలంతా నాంపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలోని లాడ్జీలో 40 రోజుల నుంచి ఉన్నారని తెలుసుకున్నారు. పలుప్రాంతాల్లోని లాడ్జీల్లో ఇలాంటి వారుండే అవకాశాలున్నాయన్న అంచనాతో కొద్దిరోజుల నుంచి ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాలు ముఖ్యంగా ఉత్తర భారతం, ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చినవారి వివరాలు, వేలిముద్రలు సేకరిస్తున్నారు. వీరి పేర్లు, ఊరు తప్ప ఎలాంటి వివరాలు లాడ్జీల నిర్వాహకుల వద్ద లేవని గుర్తించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో నేరస్థులుంటే స్థానిక పోలీసులకు సమాచారం లభించదు. దీంతో అందరి నుంచి తప్పనిసరిగా ఆధార్‌ కార్డులు తీసుకోవాలంటూ ఆదేశించారు. వారి ఫొటోలు, చిరునామాలు, ఫోన్‌ నంబర్లను సేకరించాలని, తప్పనిసరిగా రికార్డుల్లో ఉండాలని ఆదేశించారు. సీసీటీవీ ఫుటేజీలు కూడా అందుబాటులో ఉంచాలని సూచించారు.

ఇదీ చూడండి: పోలీస్ ఠాణాలకు కరెంట్‌ కట్‌ చేసిన తండ్రి అరెస్ట్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.