ETV Bharat / jagte-raho

కట్నం కోసం భార్యను హత్య చేసిన భర్త - husband killed his wife in warangal urban district

వరంగల్​ అర్బన్ జిల్లా హన్మకొండలోని ప్రకాశ్​రెడ్డిపేటలో ఈనెల 16న వివాహిత మృతికి సంబంధించి సుబేదారి పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. సంగీత ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందలేదని, ఆమె భర్తే హత్య చేశాడని తెలిపారు.

husband killed his wife for dowry in hanamkonda
కట్నం కోసం భార్యను హత్య చేసిన భర్త
author img

By

Published : Jul 20, 2020, 7:45 PM IST

వరంగల్​ అర్బన్ జిల్లా హన్మకొండలోని ప్రకాశ్​రెడ్డిపేటలో ఈనెల 16న సంగీత అనే వివాహిత మృతి చెందిన కేసులో కీలక విషయాలను సుబేదారి పోలీసులు వెల్లడించారు.

సంగీత మృతి తర్వాత ఆమె భర్త నాగరాజు, అతని తండ్రి బాలు పరారయ్యారని తెలిపారు. ఆదివారం సాయంత్రం డబ్బు, దుస్తులు తీసుకోవడానికి వారు ఇంటికి వెళ్లారనే సమాచారం రాగా.. అక్కడికి చేరుకున్న సుబేదారి పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

సంగీతను తానే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు దర్యాప్తులో నాగరాజు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈనెల 16 అర్ధరాత్రి తన భార్యతో గొడవపడినట్లు, ఆ ఘర్షణలో చీరను ఆమె గొంతుకు బిగించి హత్య చేసినట్లు చెప్పారని వెల్లడించారు.

ప్రకాశ్​రెడ్డిపేటకు చెందిన నాగరాజుకు ఈ ఏడాది మార్చి 22న కామారెడ్డి జిల్లాకు చెందిన సంగీతతో వివాహం జరిగింది. పెళ్లై నాలుగు నెలలు కూడా గడవకముందే నాగరాజు అదనపు కట్నం కోసం సంగీతను వేధింపులకు గురిచేసేవాడని, ఆ విషయంలో ఘర్షణ పడుతూనే ఆమెను నాగరాజు హత్యచేసినట్లు సుబేదారి పోలీసులు తెలిపారు. నాగరాజు అతని తండ్రి బాలును అరెస్టు చేసి రిమాండ్​కు తరలించినట్లు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.