ETV Bharat / jagte-raho

సాఫ్ట్​వేర్ ఉద్యోగి పైశాచికత్వం.. తొలిరాత్రే భార్యపై రాక్షసత్వం! - Guntur latest news

మొదటిరాత్రే భర్త పైశాచికత్వంగా ప్రవర్తించాడు. తనకు న్యాయం చేయాలని ఓ యువతి ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు గ్రామీణ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది.

husband
నవ వధువుపై భర్త పైశాచికత్వం!
author img

By

Published : Dec 22, 2020, 3:09 PM IST

ఎన్నో కలలతో సంసార జీవితంలోకి అడుగుపెట్టిన ఓ యువతి తొలిరాత్రే భర్త ప్రవర్తనతో హతాశురాలైంది. తనపై భర్త పైశాచికంగా ప్రవర్తించి, గాయపరిచాడంటూ సోమవారం ఆంధ్రప్రదేశ్​ గుంటూరు రూరల్‌ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు.. ప్రకాశం జిల్లాకు చెందిన యువకుడు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. నరసరావుపేటకు చెందిన యువతి సైతం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. అక్టోబరు నెలలో వీరికి వివాహమైంది. మొదటిరాత్రి అతని ప్రవర్తనతో.. భయపడుతున్నాడని భావించి రోజులు గడుపుకుంటూ వచ్చారు.

రెండురోజుల కిందట మళ్లీ మొదటి రాత్రి ఏర్పాటు చేయగా అతను ఆమె నైటీ వేసుకొని వింతగా ప్రవర్తించాడు. అంతేగాక ఆమెకు మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చి బ్లేడ్‌తో మర్మావయాలు, శరీరంపై గాయాలు చేశాడు. వధువు ఈ విషయాన్ని పెద్దలకు తెలియజేసింది. వాళ్లు వరుడి బంధువులను సంప్రదించగా వధువే సంసారానికి పనికిరాదంటూ గొడవపెట్టుకున్నారు. దీంతో గాయాలతో ఉన్న ఆమెను తీసుకొని తల్లిదండ్రులు ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. స్పందన అధికారులు వెంటనే నరసరావుపేట పోలీసులకు సమాచారం ఇచ్చి ఆమె ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇదీ చూడండి: మైక్రోఫైనాన్స్‌ యాప్​ల వేధింపులు.. వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.