ETV Bharat / jagte-raho

జీఎస్టీ పేరుతో 250 కోట్లకు టోకరా యత్నం, గుట్టురట్టు - gst

వ్యాపార లావాదేవీలు నిర్వహించకుండానే నకిలీ రశీదులను సృష్టించి జీఎస్టీ రాయితీ పొందేందుకు యత్నించిన నల్ల కంపెనీ యాజమాన్యానికి సుప్రీంకోర్టులో చుక్కెదురయ్యింది. ఆయా సంస్థల డైరెక్టర్లు దేశం విడిచి పారిపోకుండా లుకౌట్ నోటీసులను జీఎస్టీ అధికారులు జారీ చేశారు. దాదాపు రూ.250 కోట్ల మొత్తాన్ని జీఎస్టీ రాయితీ పొందేందుకు యత్నించి పరారీలో ఉన్న ఆరుగురు డైరెక్టర్ల అరెస్ట్​కు రంగం సిద్ధమైంది.

gst
author img

By

Published : May 28, 2019, 5:32 PM IST

Updated : May 28, 2019, 7:29 PM IST

డొల్ల కంపెనీల గుట్టు రట్టు

హైదరాబాద్ కేంద్రంగా 8 సెల్ కంపెనీల ద్వారా వ్యాపార లావాదేవీలు నిర్వహించినట్లు నకిలీ రశీదులను సృష్టించారు. ఎలాంటి వ్యాపారం చేయకుండానే రూ.1,445 కోట్ల విలువైన వ్యాపార లావాదేవీలు చేసినట్లు ఆ డొల్ల కంపెనీలు చూపాయి. వాటిని జీఎస్టీ వెబ్​సైట్లో అప్​లోడ్ చేశాయి. తద్వారా దాదాపు రూ.250 కోట్లు జీఎస్టీ రాయితీ పొందేందుకు ప్రయత్నించాయి. కాగితాల్లోనే వ్యాపార లావాదేవీలను చూపిన ఈ డొల్ల కంపెనీలు ప్రభుత్వం నుంచి రాయితీ పొందాలని చేసిన ప్రయత్నాలను జీఎస్టీ అధికారులు విఫలం చేశారు. బంజారాహిల్స్​లోని ఆ కంపెనీలపై దాడులు నిర్వహించి... పెద్ద మొత్తంలో రబ్బర్ స్టాంపులు, ఇతర ధ్రువపత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

విచారణకు సహకరించాలి: సుప్రీం

సెల్ కంపెనీలకు చెందిన ఓ డైరెక్టర్​ను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. డొల్ల కంపెనీలకు చెందిన ఇతర డైరెక్టర్లు హైకోర్టును ఆశ్రయించారు. జీఎస్టీ అధికారులు జారీచేసిన నోటీసులను సవాల్ చేస్తూ... అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో వాదప్రతివాదనలు విన్న న్యాయస్థానం విచారణకు సహకరించాలని డైరెక్టర్లకు సూచించింది. దీంతో అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వాలని సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్​ను దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని సుప్రీం తోసిపుచ్చింది.

లుకౌట్ నోటీసుుల జారీ

సర్వోన్నత న్యాయస్థానం పిటిషన్​ను కొట్టివేయడం వల్ల అధికారులు చట్టపరమైన చర్యలకు ఉపక్రమించారు. అజ్ఞాతంలో ఉన్న సెల్ కంపెనీల డైరెక్టర్లు విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఏ క్షణంలో అయినా అజ్ఞాతంలో ఉన్న ఆరుగురు కీలక వ్యక్తులను అరెస్ట్ చేస్తామని హైదరాబాద్ కేంద్ర జీఎస్టీ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. అభియోగాలు నిర్ధరణ అయితే జీఎస్టీ సెక్షన్ 132 కింద ఐదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని వెల్లడించారు. రాయితీ పొందేందుకు యత్నించిన రూ.250 కోట్ల మొత్తానికి సమానమైన అపరాధ రుసుం వారిపై విధించేందుకు జీఎస్టీ చట్టంలోని సెక్షన్ 22 అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు.

ఇదీ చూడండి: నేనా.. పార్టీ మారతానా? అంతా ఉత్తముచ్చటే!

Intro:Body:Conclusion:
Last Updated : May 28, 2019, 7:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.