కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని చొక్కారావుపల్లి శివారులో గొర్రెల యజమానిని కట్టేసి గొర్రెలను అపహరించిన ఘటనలో పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. గ్రామశివారులోని మంద వద్ద ఉన్న యజమాని కనకయ్యను కట్టేసి తొమ్మిది గొర్రెలు, రెండు మేకలు ఎత్తుకెళ్లిన ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.
కరీంనగర్ జిల్లా బావుపేటకు చెందిన ఎండీ అస్లాం, శాంతినగర్కి చెందిన ఎండీ సాజీద్, ఎండీ అస్లాం, ఓ బాలుడితో కలిసి ఈ నెల 6న రాత్రి గొర్రెలు దొంగిలించి... వాటిని హైదరాబాద్లో ఉంటున్న కమలప్రసాద్కి విక్రయించారని పోలీసులు తెలిపారు. సీసీటీవీ చిత్రాల ఆధారంగా నిందితులను పట్టుకున్నామని డీసీపీ చంద్రమోహన్ తెలిపారు. నిందితుల నుంచి రూ.44,000 నగదు, మూడు సెల్ఫోన్లు, కారుని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని సీపీ కమలాసన్ రెడ్డి అభినందించారు.
ఇదీ చూడండి: పోలీసుల నకిలీ ఫేస్బుక్లతో దోచేస్తున్నారు