ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం విమానాశ్రయం సమీపంలోని షీలానగర్ సీఎఫ్ఎస్ కంటైనర్ యార్డులో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. రసాయనాలు మండి భారీగా మంటలు ఎగసిపడ్డాయి.
కంటైనర్లలోని హానికర రసాయనాలు దగ్ధమై దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని ఆవరించింది. అగ్నిప్రమాదంతో ఎల్లపువానిపాలెం ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు.
ఇదీ చదవండి: టైటానిక్ ప్రేమికులు పెట్టుకున్నారు మాస్కులు!