మహబూబాబాద్ జిల్లా కేంద్రం తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని మీసేవ కేంద్రంలో శనివారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. మీ సేవాలో నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు.. అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.
ఈ ప్రమాదంలో 3 ల్యాప్‌టాప్‌లు, జిరాక్స్ మిషన్, 4 ప్రింటర్లు, సామగ్రి దగ్ధమయ్యాయి. సుమారు రూ. 5 లక్షల ఆస్తి నష్టం సంభవించిందని మీసేవ నిర్వాహకుడు తెలిపాడు. కేంద్రం మూసివేసి ఇంటికి వెళ్లిన గంట లోపే ఈ ఘటన చోటుచేసుకుందని పేర్కొన్నాడు.
ఇదీ చదవండి: ఆన్‌లైన్ రుణ యాప్‌ల వేధింపులకు మరో ప్రాణం బలి