హైదరాబాద్ కుల్సుంపూర పోలీస్స్టేషన్ పరిధిలోని ఓవైసీ రోడ్డు వద్ద స్క్రాప్ దుకాణంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో దుకాణంలో మంటలు చెలరేగాయి. పరిసరాలు పొగతో నిండిపోయాయి. గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారమందించారు.
అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పి వేసింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోగా.. కొంత మేర ఆస్తి నష్టం జరిగినట్లు పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.