ETV Bharat / jagte-raho

ఫ్లైవుడ్​ గోదాంలో అగ్నిప్రమాదం... 2 లక్షల సరుకు దగ్ధం - secundrabad news

సికింద్రాబాద్​లో ప్రమాదవశాత్తు ప్లైవుడ్​ గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడగా... స్థానికులు తీవ్ర భయాందోళకు గురయ్యారు. సుమారు రూ.2 లక్షల సరుకు దగ్ధమైనట్లు స్థానికులు అంచనా వేస్తున్నారు.

fire accident in plywood go down at secundrabad

author img

By

Published : Aug 10, 2020, 3:14 AM IST

సికింద్రాబాద్​ జవహార్​నగర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని ఫ్లైవుడ్ గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. చెన్నాపురం వద్ద ఉన్న ఫ్లైవుడ్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడటం వల్ల స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దాదాపు 3, 4 లారీలు ప్లైవుడ్ చెక్కలు పూర్తిగా దగ్ధమయ్యాయి.

స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. 2 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతుండటం వల్ల ఒక్కసారిగా భయాందోళనకర వాతావరణం నెలకొంది. అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో గోదాంలో ఎవరూ లేకపోవటం వల్ల పెద్ద ప్రమాదమే తప్పింది. దాదాపు రూ. 2 లక్షల విలువైన ప్లైవుడ్ చెక్కలు మంటల్లో దగ్ధమైంది. ఫ్లైవుడ్ గోదాం కుతాడి మల్లేశ్​కు చెందినదిగా స్థానికులు తెలిపారు.

ఇదీ చదవండి: కాంగ్రెస్​ వర్గీయుల బాహాబాహీ.. ఒకరిపై ఒకరి కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.