వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో రోడ్డు ప్రమాదం జరిగింది. బాలసముద్రానికి చెందిన గజ్జెల సంజీవ్, అతని కుమారుడు రూపేశ్(20) పని మీద స్కూటీపై వెళ్తున్నారు. నక్కలగుట్ట వద్ద నీరున్న రహదారిపై వెళ్తుండగా స్కూటీ అదుపుతప్పి కిందపడ్డారు. అదే సమయంలో పక్కనే వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనుక టైరు కింద పడటం వల్ల తండ్రీకుమారులు అక్కడికక్కడే మృతి చెందారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పని మీద ఇంటి నుంచి కలిసి వెళ్లిన తండ్రీకుమారులు మరణించడం ఆ కుటుంబాన్ని తీవ్ర దుఃఖంలోకి నెట్టేసింది.