మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం చెట్ల గౌరారంకు చెందిన మల్లయ్య(50)కు తన వ్యవసాయ పొలంలో కరెంట్‌షాక్ కొట్టి మృతి చెందాడు. పొలానికి భార్య భాగ్యమ్మతో కలిసి వెళ్లాడు. వేలాడుతున్న విద్యుత్ తీగలను సరి చేస్తుండగా ప్రమాదం సంభవించింది. ఈ తరుణంలో రైతు అక్కడికక్కడే పొలంలో పడి మరణించాడు.
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. ఎన్ని సార్లు చెప్పినా అధికారులు స్తంభాలు ఏర్పాటు చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి : వర్షాలతో భారీ గుంతలు... పట్టించుకోని అధికారులు