మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి గ్రామీణ సీఐ జగదీష్ పేరు మీద గుర్తు తెలియని వ్యక్తులు నకిలీ ఫేస్బుక్ ఖాతా ప్రారంభించారు. అర్జెంట్‌గా పది వేలు పంపించమంటూ... సీఐ స్నేహితుడికి సందేశం పంపించారు. దీనిని గమనించి అప్రమత్తమైన సీఐ... తన పేరుతో వచ్చే సందేశాలకు స్పందించవద్దని సూచించారు. ఈ మేరకు ఓ ప్రకటనను వాట్సప్ పోస్టు చేశారు.
పోలీసులకు సంబంధించిన నకిలీ ఫేస్బుక్ ఖాతాను సృష్టించడం సంచలనం కలిగిస్తోంది. సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. హ్యాకర్లు ఏకంగా పోలీసుల పేరు మీదనే నకిలీ ఖాతాలు సృష్టించడం విస్మయం కలిగిస్తోంది. దీనిని పోలీసు శాఖ సీరియస్‌గా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: నల్గొండ ఎస్పీ అకౌంట్ హ్యాక్.. డబ్బుల వసూళ్లకు పాల్పడిన కేటుగాళ్లు!