కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేట్‌లో విషాదం చోటుచేసుకుంది. వీడియోకాల్‌లో పిల్లలు చూస్తూ... వద్దు నాన్నా అంటుండగానే ఘోరం జరిగిపోయింది. రెండు రోజుల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన లక్ష్మణ్ ఎలక్ట్రిషియన్‌గా పని చేస్తున్నాడు. పదిహేనేళ్ల క్రితం ఉపాధి కోసం కామారెడ్డి వచ్చారు.
వ్యాపారం కోసం రెండు గొలుసుకట్టు లాటరీ సంస్థల్లో ఐదు లక్షలు అప్పు తెచ్చి మరీ పెట్టుబడి పెట్టారు. కరోనా మహమ్మారి వల్ల సదరు సంస్థలు బోర్డు తిప్పేయడం వల్ల అప్పులు తీర్చే మార్గం లేక మానసిక వ్యథకు గురయ్యాడు. అదే ఆలోచనతో పోసానిపేట్ వెళ్లొస్తానని చెప్పిన లక్ష్మణ్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మెడకు తాడు బిగించుకుని వీడియోకాల్‌లో మాట్లాడుతూనే... పిల్లలు ఉరి వద్దని బతిమాలుతున్నా వినకుండా బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఇదీ చూడండి: కూల్‌డ్రింక్ అనుకుని పురుగుల మందు తాగేశారు