కోవిడ్ టీకా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటూ చరవాణులకు వచ్చే సందేశాలను నమ్మవద్దని సైబర్ క్రైం పోలీసులు సూచించారు. ఈ రకంగా వచ్చే సందేశాలు, ఫోన్ కాల్స్ నకిలీవని స్పష్టం చేశారు.
రిజిస్ట్రేషన్ పేరిట డబ్బులు వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని యాదాద్రి భువనగిరి జిల్లా రాచకొండ సైబర్ క్రైం ఏసీపీ హరినాథ్ తెలిపారు. ఇందుకోసం కొందరు సైబర్ నేరగాళ్లు రూ. 2 నుంచి 4 వేల వరకు వసూలు చేస్తున్నారని చెప్పారు. టీకా కోసం ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వచ్చే వరకు ఎటువంటి సందేశాలను పట్టించుకోవద్దని హరినాథ్ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: గుడిలో 40 ఏళ్ల మహిళపై గ్యాంగ్ రేప్