నల్గొండ జిల్లా దేవరకొండ మండలంలోని మడమడకలో ఏటేల్లి తిరుపతి అనే రైతు 4 ఎకరాల్లో పత్తి సాగుచేశాడు. పత్తి కోసుకుని పొలం వద్ద నిల్వ చేసుకొన్నాడు. వర్షం కారణంగా నిల్వ చేసిన పత్తి తడిస్తే ఇబ్బంది అనుకున్న తిరుపతి పంటను ఇంటికి తీసుకుపోదామనుకున్నాడు. తన ముగ్గురు కుమార్తెలతో కలిసి పొలం దగ్గరకు పత్తిని తీసుకొచ్చేందుకు వెళ్లాడు.
ఆ సమయంలో తన పొలంలో ఉన్న వేపచెట్టుపై పిడుగు పడింది. ఆ ధాటికి సమీపంలో ఉన్న తిరుపతి కుమార్తె పార్వతి అక్కడికక్కడే మృతి చెందింది. తిరుపతి కాళ్లు అచేతనకు గురై.. అతనితోపాటు తన మిగతా ఇద్దరు కూతుర్లు కూడా స్పృహతప్పి పడిపోయారు. గ్రామస్థులు వారిని గమనించి తిరుపతి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల దేవరకొండ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఓ వైపు తండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందడం.. మరోవైపు కుమార్తె మరణించడం వల్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: పిడుగు పడి వ్యక్తి మృతి..స్పృహ కోల్పోయిన 12 మంది రైతులు