ETV Bharat / jagte-raho

మాస్కులు సరఫరా చేస్తామంటూ వైద్యుడికి టోకరా - ఎన్​-95 మాస్కుల పేరుతో ఆన్​లైన్ మోసాలు

కరోనా కాలంలోనూ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. డిమాండ్​ ఎక్కువగా ఉన్న మాస్కుల సరఫరా చేస్తామంటూ నమ్మించి డబ్బులు గుంజుతున్నారు. ఖాతాలో నగదు జమ కాగానే ఫోన్ స్విచ్చాఫ్ చేస్తున్నారు. మోసపోయామని గ్రహించిన బాదితులు లబోదిబోమంటున్నారు.

cyber criminals cheating doctor for supplying n-95 masks in online
మాస్కులు సరఫరా చేస్తామంటూ వైద్యుడికి టోకరా
author img

By

Published : May 1, 2020, 8:32 PM IST

మాస్కుల పేరుతో సైబర్ నేరగాళ్లు వైద్యుడిని మోసం చేసిన ఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది. ఎక్స్​పోర్టు ఇండియా అనే వెబ్​సైట్​లో ఎన్​-95 మాస్కులు ఆర్డర్ చేశాడు. ఇది గమనించిన సైబర్ నేరగాళ్లు వైద్యుడికి ఫోన్​ చేసి అనుకున్న ధరకే సరఫరా చేస్తామని నమ్మించి, ముందుగా సగం డబ్బులు పంపించాలని సూచించారు. ఒప్పదం ప్రకారం వైద్యుడు రూ.56 వేలు బదిలీ చేశాడు. నగదు ఖాతాలో జమ కాగానే నిందితులు ఫోన్ స్విచ్చాఫ్​ చేశారు. మోసపోయానని గ్రహించిన బాదితుడు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి సారించండి : మోదీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.