ETV Bharat / jagte-raho

బెట్టింగు రాయుళ్ల హడావుడి... ఐపీఎల్‌ ముగిసే వరకు గట్టి నిఘా - ipl Betting in Khammam district

సత్తుపల్లికి చెందిన ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థికి క్రికెట్‌ అంటే పిచ్చి. గతేడాది జరిగిన ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌- చెన్నై సూపర్‌కింగ్స్‌ మధ్య మ్యాచ్‌ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. గెలుపు ఇరుజట్ల మధ్య దోబూచులాడుతోంది. ఇంతలో విద్యార్థి చరవాణి మోగింది. ‘ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారంటావ్‌..!’ అడిగాడు అవతలి వ్యక్తి. ఇంతకీ మీరెవరు? అన్నాడు రాము. అతని వివరాలు చెప్పి.. ఈ ఆటలో ఏ జట్టు గెలుస్తుందో పందెం కాస్తావా..? గెలిస్తే రూ.వెయ్యికి రూ.పది వేలు.. అన్నాడు. దీంతో ఆశపడ్డ విద్యార్థి బెట్టింగ్‌ కట్టి చేతులు కాల్చుకున్నాడు. ఇలా విద్యార్థులను, యువకులను లక్ష్యంగా చేసుకున్న ముఠాలు ఉమ్మడి జిల్లాలో జోరుగా ఐపీఎల్‌ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నాయి. నేటి నుంచి దుబాయ్‌లో ప్రారంభం కానున్న ఐపీఎల్‌ నేపథ్యంలో బెట్టింగ్‌ మాఫియా జిల్లా యువత, పందెరాయుళ్లపై దృష్టి సారించాయి.

cricket betting in khammam district
పందెం కోళ్లు... బెట్టింగురాయుళ్ల హడావుడి
author img

By

Published : Sep 19, 2020, 2:31 PM IST

ఐపీఎల్‌ క్రికెట్‌ సందడి శనివారం నుంచి ప్రారంభం కానుంది. స్టేడియాల్లో అనుమతిలేదు. కొవిడ్‌ ప్రభావంతో క్రీడలకు దూరమైన అభిమానులకు నేటి నుంచి ఐపీఎల్‌ బోలెడంత వినోదాన్ని అందించనుంది. గతేడాది ఐపీఎల్‌ మ్యాచులను వీక్షించిన వారి కంటే ఈసారి వీరి సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని క్రీడా పండితులు, విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో..

క్రికెట్‌ మ్యాచులను తిలకించి ఆస్వాదించే వారిలో 7-19 ఏళ్ల వయస్సువారు, 35-60 ఏళ్ల వయస్సు వారే అధికంగా ఉన్నారని అంచనా. కొవిడ్‌ నిబంధనల నేపధ్యంలో ఆన్‌లైన్‌ పాఠాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో జిల్లాలో 20 వేల మంది విద్యార్థులులు అదనంగా స్మార్ట్‌ఫోన్ల పరిధిలోకి వచ్చారు. ఉమ్మడి జిల్లాలో 12 లక్షల స్మార్ట్‌ ఫోన్లు ఉన్నాయని టెలికాం ఆపరేటర్ల లెక్కలు చెబుతున్నాయి. ఐపీఎల్‌ నేపథ్యంలో రూ.లక్షలు చేతులు మారుతాయనే అంచనా వేస్తున్నారు. పందెంరాయుళ్లపై జిల్లా పోలీసుల నిఘా పెంచాల్సిన అవసరం ఉంది. పోలీసులు కేవలం ఖమ్మం, ఇతర ముఖ్య పట్టణాలపైనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ పందాలు ఊపందుకొంటున్నాయనే కోణంలో దృష్టి సారించాల్సి ఉంది. గతంలో ఎర్రుపాలెంలో పట్టుబడ్డ బెట్టింగ్‌ ముఠానే దీనికి నిదర్శనం.

పట్టుబడినా మారని తీరు !

గత పదేళ్లుగా ఐపీఎల్‌ మ్యాచ్‌లపై భారీస్థాయిలో బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. ప్రతి సీజన్లో పూర్వ ఖమ్మం జిల్లాలో రూ.కోట్లలోనే బెట్టింగ్‌ వ్యాపారం జరుగుతోంది. ఈ వ్యవహారంపై పోలీసులు దృష్టిసారించి నిందితులపై కేసులు నమోదు చేసినా వారి తీరు మారడం లేదు. ఫలితంగా వారి ఉచ్చులో పడిన యువత ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. అమాయకులు అప్పులపాలవుతున్నారు. గతేడాది ఖమ్మం అర్బన్‌ ప్రాంతానికి చెందిన ఓ కళాశాల విద్యార్థి స్కాలర్‌షిప్‌ డబ్బుతో ఐపీఎల్‌ పందెం కాశాడంటే పరిస్థితి అంచనా వేయవచ్చు.

ఏఏ ప్రాంతాల్లో అధికమంటే..

ఆంధ్రా సరిహద్దుగా ఉన్న మధిర, అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గాల్లో పందాలు జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. కృష్ణ, పశ్చిమగోదావరి తదితర జిల్లాలకు చెందిన కొందరు ఉమ్మడి జిల్లాను లక్ష్యంగా చేసుకుని బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. బెట్టింగ్‌ తంతు ఎక్కువగా చిన్నపాటి హోటళ్లలో, బారుల్లో, ఛాయ్‌ కేఫ్, లాడ్జీలలో జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో పోలీసులు డేగ కన్నేశారు. జిల్లా వ్యాప్తంగా మిగిలిన అన్ని ప్రాంతాలు ఒక్క ఎత్తయితే ఖమ్మం నగరంలోని త్రీటౌన్‌ ప్రాంతం ఒకెత్తు. ఐపీఎల్‌ సీజన్‌లోనే కాకుండా సాధారణ రోజుల్లో కూడా ఇక్కడ బెట్టింగ్‌ల పర్వం జోరుగా సాగుతోంది. గాంధీచౌక్‌ సమీపంలో జ్యూస్‌ పాయింట్‌ నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని గతేడాది పట్టుకొని సుమారు రూ.4లక్షలతోపాటు 10కి పైగా చరవాణులు, పలు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఒక్క ప్రాంతంలోనే ఐపీఎల్‌ సీజన్‌లో రూ.15 కోట్లకు పైగా బెట్టింగ్‌ దందా సాగుతుందని సమాచారం.

అంతర్జాలంలో...

గతంలో ముంబయి, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ లాంటి రాష్ట్రాలకు చెందిన కొంతమంది బెట్టింగ్‌ ఏజెంట్లు జిల్లాలో మకాం వేసి బెట్టింగ్‌ పర్వాన్ని కొనసాగించేవారు. ఇప్పుడు అరచేతిలో ప్రపంచాన్ని చూపుతున్న సాంకేతికతను ఆసరా చేసుకొని చరవాణుల ద్వారా బెట్టింగ్‌లపై ఆసక్తి ఉన్నవారిని ఈ ఉచ్చులోకి లాగి అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ తరహా బెట్టింగ్‌లకు పాల్పడుతున్న వారిని గుర్తిస్తున్నప్పటికీ ఏజెంట్లను గుర్తించడం పోలీసులకు కూడా సవాల్‌గా మారుతోంది.

ఐపీఎల్‌ ముగిసే వరకు గట్టి నిఘా:

ఐపీఎల్‌ మొదలైంది మొదలు ముగిసే వరకు గట్టి నిఘా ఉంచాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అన్ని లాడ్జీలు, హోటళ్లు, పాన్‌షాపులు, ఛాయ్‌కేఫ్‌లు, సెలూన్‌లు తదితర ప్రాంతాల్లో నిఘా పెట్టాం. సామూహికంగా ఒక్క ప్రాంతంలో ఉంటూ పందాలుకు పాల్పడటమే కాకుండా, ఆన్‌లైన్‌ ద్వారా బెట్టింగ్‌లకు పాల్పడే వారిపై కూడా పోలీసుల పర్యవేక్షణ ఉంటుంది. చిక్కితే కఠిన చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా విద్యార్థులు, యువకులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. -గంటా వెంకట్రావు టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ, ఖమ్మం

ఇదీ చూడండి: హవాలా మార్గంతో తరలిస్తున్న 3 కోట్ల 75 లక్షలు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.