ETV Bharat / jagte-raho

ఆంధ్రాలో హైటెక్ వ్యభిచారం... రంగంలోకి సీఐడీ

author img

By

Published : Dec 6, 2020, 8:06 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గుట్టుగా సాగుతున్న హైటెక్ వ్యభిచారాన్ని.. సీఐడీ సైబర్ విభాగం అధికారులు గుర్తించారు. ప్రధాన నగరాలైన విశాఖ, విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరంలో ఏక కాలంలో దాడులు నిర్వహించారు. సంతోష్ అనే ప్రధాన నిందితుడితో సహా కోల్​కతాకు చెందిన యువతిని విశాఖలో అదుపులోకి తీసుకున్నారు.

cid-cyber-wing-rides-in-various-main-cities-in-ap-on-hi-tech-prostitution-through-online
హైటెక్ వ్యభిచారంపై ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఐడీ దాడులు

అంతర్జాలం వేదికగా హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పోలీసులతో కలిసి ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ, విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరంలో.. ఏక కాలంలో సీఐడీ సైబర్ విభాగ అధికారులు దాడులు నిర్వహించారు. విశాఖలోని ఓ స్టార్ హోటల్‌పై దాడి చేసి.. ప్రధాన నిందితుడు సంతోష్​తో పాటు కోల్‌కతాకు చెందిన ఓ యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఇతర నిందితులు పవన్, క్రాంతిలు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

అంతర్జాలం ద్వారా కోల్‌కతా యువతులను విశాఖకు రప్పించి.. ఈ నిందితులు విటులను ఆకర్షిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో సంతోష్​తో పాటు కోల్‌కతాకు చెందిన ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు ఉన్నారన్నారు. విశాఖ వాసులు పవన్, క్రాంతిలు వారితో కలిసి.. ఈ దందాను నిర్వహిస్తున్నారని తెలిపారు.

ఇదీ చదవండి: ఆటోను ఢీకొన్న టిప్పర్...డ్రైవర్​కు తీవ్ర గాయాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.