ఏపీలోని కర్నూలు జిల్లా సంజామల మండలం కానాల గ్రామంలో విషాదం జరిగింది. ఆటో ఢీకొని నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. గ్రామానికి చెందిన శ్రీనివాసులు, వెంకట లచ్చమ్మ కుమార్తె శృతి దుకాణానికి వెళ్లి ఇంటికి వస్తుండగా.. ఆటో ఢీకొట్టింది.
ఘటనలో శృతి అక్కడికక్కడే మృతిచెందింది. శ్రీనివాసులు, వెంకట లచ్చమ్మ దంపతులకు.. శృతి 20 ఏళ్ల తర్వాత పుట్టింది. చిన్నారి మృతితోో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంజామల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: జేబుదొంగ దారుణ హత్య... మృతదేహాన్ని సూట్‌కేసులో కుక్కి