ETV Bharat / jagte-raho

ఎన్​-95 మాస్కుల పేరుతో రూ. 90 లక్షల మోసం... - hyderabad crime news

3ఎం ఎన్​95 8310 మోడల్ మాస్కులను అందజేస్తానని చెప్పిన సుమారు రూ. 90.65 లక్షలు మోసం చేసినందుకుగాను ఉదయ్​శంకర్​ పారుపల్లిపై పోలీసులు చీటింగ్​ కేసు నమోదు చేశారు. తన డబ్బులు తిరిగిచ్చేయాలని కోరిన ఫిర్యాదుదారుపై హత్య బెదిరింపులకు పాల్పడినట్లు ఫిర్యాదుదారు ఆరోపించారు.

cheating case of Rs. 90.65 lakhs was registered against Udayashankar parupalli
ఉదయ్​శంకర్​ పారుపల్లిపై రూ. 90 లక్షల చీటింగ్​ కేసు నమోదు
author img

By

Published : Nov 7, 2020, 6:44 PM IST

ఉదయ్​శంకర్​ పారుపల్లిపై రూ. 90.65లక్షలు మోసం చేసినందుకు గాను పోలీసులు కేసు నమోదు చేశారు. మే 22న రెండు లక్షల 3ఎం ఎన్​95 8310 మోడల్ మాస్కులను డాక్టర్​ చంద్రమోహన్​ డ్యూక్​ కంపెనీ బిష్​కేక్, కిర్గిస్థాన్​తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ముందుగా తన ఫార్మా కంపెనీ ఖాతాలోకి 20 శాతం మొత్తాన్ని జమ చేయాలని ఉదయ్​శంకర్​ తెలిపారని.. అతన్ని నమ్ముతూ తాను వివిధ తేదీల్లో డబ్బును జమచేసినట్లు చంద్రమోహన్​ ఫిర్యాదులో తెలిపారు.

తేదీజమ చేసిన డబ్బులు (రూ. లలో)
31 మే 2,00,000
01 జూన్ 12,00,000
22 జూన్ 57,34,824
02 జులై 19,30,337(25.000 యూఎస్​ డాలర్లు)
మొత్తం 90,65,161

ఈ లావాదేవీలు పూర్తయ్యాక ఉదయ్​శంకర్​ తనకు 3ఎం ఎన్​95 మాస్కులకు సంబంధించి ఎస్జీఎస్ సర్టిఫికేట్​ను అందజేసినట్లు చంద్రమోహన్​ తెలిపారు. అయితే అది నకిలీ ధ్రువపత్రమని తాను గుర్తించినట్లు ఆయన వివరించారు. వెంటనే ఉదయ్​శంకర్​ను సంప్రదించి.. తన డబ్బులను తిరిగిచ్చేయాలని కోరగా... పారుపల్లి ఉదయ్​శంకర్​.. నగదును చెల్లించేందుకు నిరాకరించి.. తనను చంపేస్తానని బెదిరించాడని పోలీసులకు చెప్పారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఉదయ్​శంకర్​పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: సైకో తండ్రి... ఇద్దరు కుమార్తెల గొంతు కోసి చంపేందుకు యత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.