ఇంటి ముందున్న బాలుడిని రివర్స్‌లో కారు ఢీకొట్టిన ఘటన ఈనెల 12న హైదరాబాద్ పాతబస్తీ కాలాపత్తర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. శంషీర్ గంజ్‌లోని ఓ వీధిలోని ఇంటి ముందు ఇద్దరు పిల్లలు ఉండగా.. ఈ ఘటన చోటు చేసుకుంది. కారు ఒక్కసారిగా రివర్స్ కావడంతో వారు భయాందోళనకు గురయ్యారు.
ఈ ఘటనలో ఓ బాలుడు క్షేమంగా బయటపడగా... మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన బాలుడికి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కారు ప్రమాదానికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు రాలేదని కాలాపత్తర్ పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి: లైవ్ వీడియో: వైన్స్‌లో దొంగతనం