ETV Bharat / jagte-raho

ఆర్మూర్​లో కారు బీభత్సం.. ద్విచక్ర వాహనం ధ్వంసం - నిజామాబాద్ జిల్లా తాజా సమాచారం

నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​లో ఓ కారు బీభత్సం సృష్టించింది. పట్టణంలోని క్లాక్​ టవర్​ వద్ద ద్విచక్ర వాహనాన్ని, కార్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోయినా.. స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.

Car crash in  Two-wheeler wrecked in Armor town nizamabad dist
ఆర్మూర్​లో కారు బీభత్సం...ద్విచక్రవాహనం ధ్వంసం
author img

By

Published : Dec 7, 2020, 7:14 PM IST

అదుపుతప్పిన కారు ఆగమాగం చేసింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్​లో కూరగాయల బండిని ఢీకొట్టి, పక్కనే ఉన్న ద్విచక్ర వాహనాన్ని, రెండు కార్లను ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్​ నుజ్జునుజ్జు కాగా...రెండు కార్లు బాగా దెబ్బతిన్నాయి. కూరగాయలన్నీ చెల్లాచెదురుగా రోడ్డు మీద పడ్డాయి.

పట్టణంలోని క్లాక్​టవర్​ వద్ద బస్టాండ్​ సమీపంలో ఈ ప్రమాదం జరగడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీ చూడండి:ప్రపంచంలోనే నాణ్యమైన పత్తి ఉత్పత్తి చేసే ప్రాంతాల్లో రాష్ట్రం ఒకటి: కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.