యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలోని రాయిపల్లి వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెంపటి గ్రామానికి చెందిన శ్రీకాంత్, మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటకు చెందిన దునికిన ఉపేందర్ ద్విచక్రవాహనంపై హైదరాబాద్ నుంచి తుంగతుర్తికి వెళ్తున్నారు.
భువనగిరి పట్టణానికి చెందిన ఉడుత ప్రవీణ్ మోత్కూరు నుంచి భువనగిరికి కారులో వెళ్తున్నారు. రాయిపల్లి బస్టాండ్ వద్ద ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొనడంతో శ్రీకాంత్, ఉపేందర్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: పన్నెండు రోజుల్లో పెళ్లి.. తండ్రీ కొడుకులే మిగిలారు.!