ETV Bharat / jagte-raho

అన్నను కడతేర్చిన తమ్ముడు… మానసిక హింస భరించలేకే.. - ఉరవకొండ పోలీసులు తాజా వాార్తలు

మద్యం తాగి వచ్చి తన భార్యతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ… తీవ్ర దుర్బాషలాడుతున్నాడని సొంత అన్నను కడతేర్చాడు ఓ వ్యక్తి. ఈ ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండలో చోటు చేసుకుంది.

అన్నను కడతేర్చిన తమ్ముడు… మానసిక హింస భరించలేకే..

author img

By

Published : Sep 25, 2020, 11:42 AM IST

ఏపీలోని అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణం పాతపేటలో గురువారం సాయంత్రం జరిగిన అన్నదమ్ముల ఘర్షణలో రామాంజనేయులు(39) అనే వ్యక్తి మృతి చెందాడు. మద్యానికి బానిసైన రామాంజనేయులు తరచు తాగి వచ్చి తన భార్యతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ… తీవ్ర దుర్భషలాడాడని మల్లేశ్​ సహించలేకపోయాడు. ఆ మానసిక హింస భరించలేక ఇనుపరాడ్డుతో రామాంజనేయులు తల పగలకొట్టాడు. దీంతో రామాంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి భార్య 14 ఏళ్ల క్రితమే అతన్ని వదిలేసి వెళ్లిందని బంధువులు తెలిపారు. హత్యకు పాల్పడిన మల్లేశ్​​… తన అన్న మృతదేహం పక్కనే కూర్చొన్నాడు.

అన్ననే కదా అని 14 సంవత్సరాలుగా ఆ బాధను భరిస్తూ ఉన్నానని... తన భార్యను వినకూడని భాషలో నిత్యం తిడుతూ ఉంటే భరించలేక ఈ పని చేసినట్లు తమ్ముడు మల్లేశ్​​ చెబుతున్నట్లు పోలీసులు తెలిపారు. మల్లేశ్​​పై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు ఉరవకొండ ఎస్సై ధరణిబాబు తెలిపారు. ఓ కుమారుడు జైలుకు వెళ్లి, మరొకరు మృతి చెందడం వల్ల రామాంజనేయులు తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది.

ఇదీ చదవండి: కుమార్తె ప్రేమ పెళ్లి.. పరువు కోసం అల్లుడి హత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.