ETV Bharat / jagte-raho

విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న బొలేరో... తప్పిన ప్రమాదం

పెద్దపల్లి జిల్లా గుంజపడుగు గ్రామం వద్ద విద్యుత్ స్తంభాన్ని బొలేరో ఢీకొంది. స్తంభం విరిగి వాహనంపై పడడం వల్ల డ్రైవర్​కు గాయాలయ్యాయి. మరో వ్యక్తి సురక్షితంగా బయటపడ్డారు.

bolero-vehicle-hit-electric-pole-at-gunjapadugu-in-peddapalli-district
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న బొలేరో... తప్పిన ప్రమాదం
author img

By

Published : Jan 13, 2021, 2:03 PM IST

పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామం వద్ద విద్యుత్ స్తంభాన్ని బొలేరో వాహనం బుధవారం ఉదయం ఢీకొంది. అతివేగంగా వాహనం నడుపుతుండగా అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్​ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

వైజాగ్ నుంచి ఎన్టీపీసీకి బొలేరోలో వస్తున్న వ్యక్తులు దారితప్పారు. పెద్దపెల్లి నుంచి ఎన్టీపీసీకి వెళ్లాల్సి ఉండగా, పెద్దపెల్లి నుంచి మంథని మీదుగా ఎన్టీపీసీ వెళ్తున్న క్రమంలో గుంజపడుగు వద్ద ఈ ఘటన జరిగింది. స్తంభం విరిగి వాహనంపై పడింది. డ్రైవర్​కు గాయాలు కాగా... వెనకాల కూర్చున్న వ్యక్తి సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్​ను గోదావరిఖని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

ఇదీ చదవండి: ఇందూరు నుంచి విదేశాలకు పిండి వంటలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.