మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో పేలుళ్లు కలకలం సృష్టించాయి. మరుకు కాలనీకి చెందిన దుర్గయ్య అనే వ్యక్తి ఇంట్లోని మొదటి అంతస్తులో రెండు సార్లు పేలుళ్ళు జరిగాయి. ఈ ఘటనలో దుర్గయ్యకు తీవ్రగాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం అతన్ని మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంలో ఇంట్లోని కొన్ని వస్తువులు దగ్ధమవ్వగా పోలీసులు, ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఇంట్లో చిక్కుకున్న దుర్గయ్యను 108 వాహనంలో రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే దుర్గయ్య ఇంట్లో ఏం పేలింది అనే విషయం మాత్రం తెలియరాలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: నష్టాల్లో మార్కెట్లు- 49,150 దిగువకు సెన్సెక్స్