నకిలీ రిజిస్ట్రేషన్ నెంబరుతో తిరుగుతున్న ఇన్నోవా కారును బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. కేబీఆర్ పార్కుు వద్ద నిలిచి ఉన్న ఇన్నోవాను అనుమానించిన పోలీసులు.. సదరు డ్రైవరును కారు రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన పత్రాలు చూపించమని అడిగారు. ఇది నా సొంత కారంటూ.. దబాయిస్తూ.. టీఎస్ 07 యూసీ 7162 నెంబరు గల పత్రాలు చూపించాడు. ఆన్లైన్లో కారు నిజమైన రిజిస్ట్రేషన్ నెంబర్‌ను తనిఖీ చేయగా.. టీఎస్ 09 యూసీ 7162 అని తేలింది అనుమానించిన పోలీసులు కారును, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
నకిలీ రిజిస్ట్రేషన్, ఫేక్ నెంబర్‌తో కారు నడిపిస్తున్నారని, పసుపు రంగు నెంబర్ ప్లేట్ పెట్టుకొని తప్పించుకొని తిరుగుతున్నాడని కేసు నమోదు చేశారు. విచారణ నిమిత్తం కారును, డ్రైవర్‌ను బంజారాహిల్స్ లా అండ్ ఆర్డర్ పోలీసులకు అప్పగించినట్టు బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. కాగా.. కారుకు ఉన్న నెంబర్ ఒక ఆటోది కావడం గమనార్హం.
ఇదీ చదవండి: 2 వేలకు పైగా విద్యార్థుల ఎంసెట్ ఫలితాల్లో తేడాలు!