ETV Bharat / jagte-raho

ఆటోడ్రైవర్​పై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి - attack on autodriver at pasamailaram

సంగారెడ్డి జిల్లా పాశమైలారం గ్రామంలో అర్థరాత్రి ఆటో డ్రైవర్​పై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. బాధితుడిని చందానగర్​ ఆసుపత్రికి తరలించి... బీడీఎల్​ భానూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

auto-driver-stabbed-with-knife-at-pasamailaram-in-sangareddy-district
ఆటోడ్రైవర్​పై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి
author img

By

Published : Sep 30, 2020, 1:19 PM IST

సంగారెడ్డి జిల్లా జుక్కల్​ గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ రామచందర్.. తమ గ్రామం నుంచి పాశమైలారం వరకు ఆటో నడుపుతూ వస్తుండేవాడు. అయితే మంగళవారం అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తి మూతపడిన బీపీఎల్​ పరిశ్రమ చౌరస్తాలో ఆటో ఎక్కి పాశమైలారానికి వెళ్లాలని కోరాడు. మార్గమధ్యంలో ఆటోడ్రైవర్​పై కత్తితో దాడి చేశాడు.

పాత కక్షల నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితుడిని చందానగర్​ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రామచందర్​ పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. దాడి ఎవరు చేశారు? ఎందుకు చేశారు అనే కోణంపై పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: భర్తను కాపాడి ప్రాణాలు విడిచిన భార్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.