ETV Bharat / jagte-raho

భూ పంచాయితీ విషయంలో తీర్మానానికి వెళ్లిన సర్పంచ్​పై దాడి - Warangal Rural District news

భూ పంచాయితీ విషయంలో తీర్మానానికి వెళ్లిన సర్పంచ్​పై దాడి చేశారు కొందరు. ఈ ఘటన వరంగల్​ రూరల్ జిల్లా కడారి గూడెం గ్రామంలో చోటుచేసుకుంది.

Warangal Rural District
భూ పంచాయితీ విషయంలో తీర్మానానికి వెళ్లిన సర్పంచ్​పై దాడి
author img

By

Published : Sep 14, 2020, 9:09 PM IST

వరంగల్​ రూరల్​ జిల్లా వర్ధన్నపేట మండలం కడారిగూడెం గ్రామానికి చెందిన సర్పంచ్​ మంద సతీశ్​పై దాడి చేశారు అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు. సర్పంచ్ మంద సతీశ్​పై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. కోటేశ్వర్ కుటుంబ సభ్యులు... భూమి పంచాయితీ విషయంలో తీర్మానానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

కులం పేరుతో దూషిస్తూ.. రాళ్లతో కొట్టి తీవ్రంగా దాడి చేశారు. దీనితో సర్పంచ్​ తలపై, ముఖంపై తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. తీవ్ర రక్తస్రావంతో ఉన్న సర్పంచ్​ సతీశ్​ను వర్ధన్నపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వరంగల్- ఖమ్మం జాతీయ రహదారిపై ఎస్సీ సంఘాలు ఆందోళన నిర్వహించారు.

ఇదీ చదవండి: సీఎం కాన్ఫరెన్స్​కు ఆహ్వానించారు.. అంతలోనే రావద్దన్నారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.