నిజామాబాద్ నగర శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు బ్రిడ్జిని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉందని రూరల్ పోలీసులు వెల్లడించారు.
చంద్రశేఖర్ కాలనీకి చెందిన ఆఫ్షీన్ జబీన్ సుల్తానా అనే యువతి, లైన్ గల్లీకి చెందిన అబ్దుల్ సలామ్‌తో కలిసి ఉదయం వాకింగ్ కోసం బైక్‌పై వెళ్తున్నారు. దుబ్బ శివారులోని నూతన కలెక్టరేట్ ప్రాంతంలో బ్రిడ్జిని ఢీకొట్టడంతో సుల్తానా అనే యువతి అక్కడికక్కడే మృతి చెందింది. అబ్దుల్ సలామ్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి. నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: అమాయకులే లక్ష్యంగా రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు