ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి, ఎంపీటీసీ రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడలో అలీ అనే వ్యక్తి తన భవనంలో అదనపు నిర్మాణాలు చేపట్టాడు. అన్ని అనుమతులు ఉన్నా.. తమకు లంచం ఇవ్వాల్సిందేనని పంచాయతీ కార్యదర్శి శివయ్య, ఎంపీటీసీ శివప్రసాద్ నెలరోజులుగా బెదిరిస్తున్నారు. 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరికి 2 లక్షల వద్ద బేరం కుదిరింది.
రేపు రిమాండ్కు
ఈ విషయాన్ని బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు ఎంపీటీసీ, కార్యదర్శిని వలపన్ని పట్టుకున్నారు. నిందితులను రేపు రిమాండ్కు తరలించనున్నట్లు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.
ఇవీ చూడండి:ఈ పార్టీకి మేనిఫెస్టో లేదు, అయినా గెలుస్తూనే ఉంది