కరీంనగర్ జిల్లా గంగాధర ఎంపీపీ మధుకర్ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. మల్కాజిగిరి ఏసీపీ నరసింహ రెడ్డిపై నిర్వహించిన సోదాలకు కొనసాగింపుగా గంగాధరలోనూ అదే సమయంలో విచారణ మొదలుపెట్టారు. భూ లావాదేవీలకు సంబంధించిన పలు పత్రాలు సేకరించారు.
ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం వరకు సుదీర్ఘంగా తనిఖీలు చేశారు. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం ప్రకటిస్తామని ఏసీబీ సీఐ వేణుగోపాల్ తెలిపారు.
ఇదీ చదవండి: రూ.40 లక్షలు ఎక్కడ దాచారనే విషయంపై అనిశా ఆరా